ఏపీలో కొత్తగా 1,217 మందికి కరోనా పాజిటివ్..

80
corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 61,678 మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,217 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 198 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 15 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,535 మంది కరోనా నుంచి కోలుకోగా… 13 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,141 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 20,01,255 కేసులు నమోదు కాగా… 19,72,399 మంది కోలుకున్నారు. మొత్తం 13,715 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.