మహేష్‌ కోసం ధోనీ హీరోయిన్..!

112
kiara advani for mahesh babu

బ్రహ్మోత్సవం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈనెలాఖరుకి సినిమా పూర్తవుతుంది. ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కేస్తుంది. ఈలోగా నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు కొరటాల. ఈసారి మహేష్‌బాబు కోసం బాలీవుడ్‌ భామని తీసుకొచ్చే పనిలో ఉన్నారట.

Kiara Advani

ఆ అవకాశం ‘ఎం.ఎస్‌.ధోని’హీరోయిన్‌ కైరా అడ్వానీకి దక్కిందని తెలుస్తోంది. మహేష్‌ సినిమాతోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం తెలుగులో కోటా హీరోయిన్లు లేకపోవడం, ఉన్న స్టార్ హీరోయిన్లంతా బిజీగా ఉండటం, పైగా మహేష్ సరసన కొత్త పేస్ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో కొరటాల శివ ఈమెను ఎంచుకున్నారట. మేలో లాంఛనంగా షూటింగ్‌ మొదలెట్టి, జూన్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ ఈ సినిమా కోసం పరిశీలనలో ఉంది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత: డి.వి.వి.దానయ్య