మంచు మనోజ్.. ఎమోషనల్ పోస్ట్

13
- Advertisement -

తన భార్య గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు మంచు మనోజ్. పెళ్లై రెండు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా తన భార్యపై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు మంచు మనోజ్. రెండేళ్ల క్రితం నా లైఫ్ లోనే బెస్ట్ డెసిషన్ తీసుకున్నాను. నా ప్రపంచాన్నే మార్చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. మౌనిక.. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన క్షణం నుంచి నేను ఎప్పుడూ చూడని ప్రేమని తీసుకొచ్చావు. నేను డెస్టినీని నమ్మేలా చేసావు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

రెండేళ్లలో మనం మన ఇంటిని ప్రేమ, నవ్వులు, ఇద్దరు బ్యూటిఫుల్ లిటిల్ కిడ్స్ ధైరవ్, MM పులిలతో నింపాము. వాళ్లకు బెస్ట్ మదర్ లా ఉంటూ నీతో రోజూ మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తున్నావు. మనం ఎన్నో ఎత్తుపల్లాలు చూసాము. సక్సెస్ లు, ఫెయిల్యూర్ లు చూసాము. కానీ ఒక్కటి మాత్రం మారలేదు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నా బిగ్గెస్ట్ సపోర్టర్, నాకు అన్ని నువ్వే. ఈ రెండేళ్లు నాకు చూపించిన ప్రేమ నీతో జీవితకాలం ఉన్నా సరిపోదు. హ్యాపీ యానివర్సరీ మున్ని. టైంతో పాటు మన ప్రేమను పెంచే మరిన్ని కలలు, మరిన్ని సాహసాలు చేయాలి అని చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

- Advertisement -