‘మిరాయ్‌’ సీక్వెల్‌పై మనోజ్!

8
- Advertisement -

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్‌ . ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. మంచు మనోజ్ విలన్‌గా నటించగా శ్రియ శరణ్‌ కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీస్ ముందు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది.

ఐదో రోజు ముగిసే సమయానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను దాటగా, నార్త్ అమెరికాలోనే $2 మిలియన్ వసూళ్లు సాధించింది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మనోజ్, తాను పోషించిన మహాబీర్ లామా అలియాస్ ది బ్లాక్ స్వోర్డ్ పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సీక్వెల్‌లో ఆయన పాత్ర తిరిగి వస్తుందా అని అడిగితే, ఆయన సస్పెన్స్ పెంచుతూ..ఆయన చనిపోయినట్టు మీరు చూశారా? అని సమాధానమిచ్చారు.

సినిమాలో లార్డ్ రాముని పవిత్ర బాణంతో గాయపడ్డ తర్వాత ది బ్లాక్ స్వోర్డ్ అదృశ్యమవుతాడు. కానీ ఆయన మరణించినట్టు ఎక్కడా చూపించలేదు. అంతేకాకుండా, ఆయన ఇప్పటికే దేవతా శక్తులు ప్రసాదించే తొమ్మిది అశోక స్క్రిప్టర్స్‌ను సేకరించాడు. వాటి శక్తిని కొంతవరకు మాత్రమే గ్రహించినా, పూర్తిగా ఉపయోగించలేకపోయాడు.మనోజ్ మాటల ప్రకారం, ది బ్లాక్ స్వోర్డ్ సీక్వెల్‌లో మరింత శక్తివంతుడిగా తిరిగి వచ్చే అవకాశం ఉందని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

Also Read:కాంగ్రెస్ ఓటర్లే లక్ష్యంగా ఓటు చోరి

- Advertisement -