జర్నలిస్టుపై మంచు లక్ష్మీ కంప్లైంట్!

3
- Advertisement -

జర్నలిస్ట్ VSN మూర్తి పై ఫిల్మ్ ఛాంబర్‌కి కంప్లైంట్ చేశారు నటి మంచు లక్ష్మి. ఇంటర్వ్యూ చేసినప్పుడు తనని అడిగిన ప్రశ్న… తన డిగ్నిటీకి భంగం కలిగిస్తుందంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

తన వయసు, వేసుకునే బట్టల మీద ప్రశ్న అడగడం సరికాదని..అది ఇంటర్వ్యూ కాదు.. అటాక్ అంటూ మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జర్నలిజం కాదు, క్రిటిక్ కూడా కాదు.. పాపులర్, వైరల్ అవ్వడం కోసం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

జర్నలిస్ట్‌ల మీద నాకు గౌరవం ఉంది… మేల్ డామినేట్ ఇండస్ట్రీలో ఉన్నాను.. ఎంతో కష్టపడి నిలదొక్కుకున్నాను అన్నారు. సైలెంట్‌గా ఉంటే… ఇదే బిహేవియర్ కంటిన్యూ అవుతుంది… అందుకే కంప్లైంట్ చేస్తున్నా… డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా.. ఫిల్మ్ ఛాంబర్‌ను కోరుతున్నాను అంటూ ఫిర్యాదు చేశారు మంచు లక్ష్మి.

Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!

- Advertisement -