కొత్త వాహనం కొంటున్నారా..అయితే!

7
- Advertisement -

కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. రోడ్లు భద్రతా పన్ను పేరిట ప్రజలపై మరో భారం వేయనుంది ప్రభుత్వం. దీని ద్వారా సంవత్సరానికి రూ. 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై మరో కొత్త పన్ను విధించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రోడ్ల భద్రత సెస్ పేరిట ద్విచక్ర వాహనంపై రూ. 2 వేలు, కార్లపై రూ.5 వేలు, ఇతర హెవీ వాహనాలపై రూ. 10 వేలు వసూలు చేయాలని నిర్ణయించింది రవాణా శాఖ.

ఈ సరికొత్త సెస్ వల్ల సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఈ సెస్ వసూలు చేయాలని నిర్ణయం తీసుకోగా అసెంబ్లీలో ఆమోదం పొందిన వెంటనే అమలు చేసే ఆలోచనలో రవాణా శాఖ ఉన్నట్లు సమాచారం.

Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!

- Advertisement -