విభిన్నమైన పాత్రలతో నటిస్తూ టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ. ఇప్పటివరకూ ఆమె చేసిన సినిమాలన్ని ఎదో ఒక మెసెజ్ తో కూడిన సినిమాలే ఉంటాయి. ఆమె నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. అటు నటనతోనే కాకుండా బుల్లితెరపై కూడా తన ప్రతిభను చాటుతుంది. సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ పేదలకు అండగా నిలుస్తుంది. తన నటించే సినిమాలో తన పాత్ర కొత్తగా ఉండేలా చూసుకుంటుంది.
తాజాగా మంచు లక్ష్మి నటించిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. ఈసినిమాలో మంచు లక్ష్మీ ప్రధాన పాత్ర షోపించింది. కొద్దిసేపటి క్రితం ఈసినిమాలో మంచు లక్ష్మీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. బైక్ పై వెళుతూ ఏదో విషయాన్ని ఆన్వేషిస్తున్నట్టుగా ఈపోస్టర్లో మంచు లక్ష్మీ కనిపిస్తుంది. సస్పెన్స్ ధ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగే ఈసినిమాలో ఆమె దీక్ష పాత్రలో కనిపించనుంది. ఆదర్శ బాలకృష్ణ ఈసినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నాడు. ఇక ఈమూవీలో హీరో శ్రీకాంత్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త కథలతో ప్రేక్షకుల మందుకు రానున్న మంచు లక్ష్మీ ఈసినిమాతో ఆమె కెరీర్ ను ఏవిధంగా మలుపు తిప్పుతుందో చూడాలి. ఇక ఈమూవీ ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు మంచు లక్ష్మీ.