ఫారిన్ ట్రిప్ లో రంగ‌మ్మ‌త్త ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి..

291
anasuya
- Advertisement -

ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ త‌న యాంక‌రింగ్ తో అల‌రిస్తుండ‌గా మ‌రోవైపు వెండితెర మీద త‌న అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్రముగ్దుల‌ను చేస్తుంది. స‌రికొత్త పాత్ర‌ల‌తో ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ప్ర‌స్తుతం అన‌సూయ త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లింది. స‌మ్మ‌ర్ లో కూల్ గా ఉండే ప్ర‌దేశానికి వెళ్లి కుటుంబ‌స‌భ్యుల‌తో ఎంజాయ్ చేస్తుంది. ల‌డ‌ఖ్ లో అన‌సూయ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేసింది అన‌సూయ‌.

Anchor Anasuya Holiday Trip With Family Anasuya Bharadwaj Enjoying In Holiday...

ప్ర‌స్తుతం ఆ ఫోటొలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త‌న భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో అన‌సూయ దిగిన ఫోటోల‌ను చూసి అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అన‌సూయ ఇటివ‌లే న‌టించిన సినిమా రంగ‌స్ధ‌లం. ఈసినిమాలో అన‌సూయ త‌న న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చ‌ర‌ణ్ కు అత్త‌య్య‌గా న‌టించి ఆ పాత్ర‌కు న్యాయం చేశారు. త‌న అందంతో సినిమాలో మ‌రింత గ్లామ‌ర్ ను పెంచింది అన‌సూయ‌.

Anchor Anasuya Holiday Trip With Family Anasuya Bharadwaj Enjoying In Holiday...

ఈసినిమాలో ఆమె ప‌లువురి నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. టాలీవుడ్ లో ప‌లు సినిమాలు చేసుకుంటూ బిజిగా గ‌డుపుతుంది అన‌సూయ‌. ప్ర‌స్తుతం స‌చ్చిందిరా గొర్రె అనే సినిమాలో ఆమె న‌టిస్తున్నారు. కొత్త పాత్ర‌లు చేసుకుంటూ త‌న న‌టన‌తో ప్రేక్ష‌కుల్ని ఆనంద‌ప‌రుస్తున్నారు. మంచి క‌థ‌లు రాక‌పోవ‌డం వ‌ల్లే కొత్త సినిమాలు చేయ‌డం లేద‌ని చెప్పింది అన‌సూయ‌. అటు బుల్లితెరపై ఇటు వెండితెర‌పై ఫుల్ బిజిగా గ‌డుపుతుంది అన‌సూయ‌.

Anchor Anasuya Holiday Trip With Family Anasuya Bharadwaj Enjoying In Holiday...

- Advertisement -