మనసుకి నచ్చేంత… ప్రేముంది

274
Manasuku Nachindi Teaser
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘మనసుకు నచ్చింది’.  సందీప్ కిషన్, అమీరా దస్తూర్, త్రిధా చౌద‌రి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 2018 జనవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీలో మంజుల, సంజయ్ స్వరూప్‌ల‌ గారాల పట్టి జాన్వి కూడా నటించనున్నది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Manasuku Nachindi Teaser
సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్ర‌కృతి ప్రేమికురాలు అయిన క‌థానాయిక‌ అమైరా ద‌స్త‌ర్‌.. ఆమె స్నేహితుడు సందీప్ కిష‌న్ తో చేసే సంభాష‌ణ‌గా ఈ టీజ‌ర్ రూపొందింది.  ప్రతీ మనిషిలో ప్రపంచమంత ప్రేమ ఉంటుందిరా.. కాని 0.1% కూడా బయటకి రావడంలేదు. ఒక్కసారి మన హార్టుతో మనం కనెక్ట్ అయితే ఆ ప్రేమంతా పరిచయమౌతుంది” అని హీరోతో చెప్పే డైలాగ్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అలాగే హీరో హీరోయిన్లు ఒకరికొకరు “ఐ యామ్ ఇన్ లవ్” అని చెప్పుకోవడం.. అంతలో హీరో “నాకు తెలీకుండా ఎవరితోనే” అని ఉత్సుకతతో అడగడంతో టీజర్ ముగుస్తుంది.

- Advertisement -