‘మనసంతా నువ్వే’ రీ-రిలీజ్..తేజ భావోద్వేగం!

3
- Advertisement -

‘మనసంతా నువ్వే’ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న, వాలెంటైన్స్ డే సందర్భంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం విడుదలై ప్రేమకథలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ సినిమా తిరిగి థియేటర్లలో సందడి చేయడం తమ కుటుంబానికి గర్వకారణమని చెప్పారు.

సినిమా మొదటిసారి విడుదలైనప్పుడు తాను కేవలం 7 ఏళ్ల వయసులోనే ఉన్నానని, అప్పటి జ్ఞాపకాలు ఇంకా మనసులో తాజాగానే ఉన్నాయని తేజ తెలిపారు. ఇప్పుడు పెద్దవాడైన తర్వాత అదే సినిమాను థియేటర్‌లో చూసే అవకాశం రావడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందన్నారు. ఉదయ్ కిరణ్ నటన, పాటలు, భావోద్వేగాలు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని గుర్తుచేశారు. మరోసారి ఈ మ్యాజిక్‌ను వెండితెరపై అనుభవించాలనే ఉత్సాహంతో ఉన్నానని తేజ చెప్పారు.

Also Read:చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై దుమారం

- Advertisement -