లవర్స్ డేను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హోటళ్లలో పెద్దఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. వాలెంటైన్స్ డేకు ఇంకా ఆరు రోజుల సమయం ఉండగానే హోటళ్లలో గదులు వేగంగా నిండిపోతున్నాయని హోటల్ బుకింగ్ యాప్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బుకింగ్స్ దాదాపు 175 శాతం వరకు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ప్రత్యేకంగా మెట్రో నగరాలు, టూరిస్ట్ హబ్‌లు, హిల్ స్టేషన్లు, బీచ్ డెస్టినేషన్లలో డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, గోవా, ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాల్లో వాలెంటైన్స్ డే వీకెండ్‌కు హోటళ్లలో గదులు దాదాపు ఫుల్ అవుతున్నాయని సమాచారం. యువ జంటలే కాకుండా, మ్యారేజ్ అయిన కపుల్స్ కూడా ఈ సందర్భంగా చిన్న గెట్‌అవేలకు ప్లాన్ చేస్తున్నట్లు ట్రావెల్ యాప్స్ చెబుతున్నాయి.
హోటళ్లు ప్రత్యేక వాలెంటైన్స్ డే ప్యాకేజీలు, క్యాండిల్ లైట్ డిన్నర్లు, రొమాంటిక్ డెకరేషన్లు, డిస్కౌంట్లు ఆఫర్ చేయడంతో బుకింగ్స్ మరింత పెరిగాయని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. గతంలో చివరి నిమిషంలో బుక్ చేసుకునే వారు ఎక్కువగా ఉండగా, ఈసారి ముందస్తు ప్రణాళికతో అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు.
Also Read:ఎన్నికల ప్రచారం..మాజీ మంత్రి హరీష్ రికార్డ్
లవర్స్ డే సందర్భంగా ట్రావెల్, హాస్పిటాలిటీ రంగానికి ఇది భారీ బూస్ట్‌గా మారిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే రోజుల్లో బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

