‘మనమే’.. బ్యూటీఫుల్ స్టొరీ

4
- Advertisement -

ఛార్మింగ్ స్టార్ శర్వా తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ‘మనమే’ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ శర్వాకు ‘ఛార్మింగ్ స్టార్‌’ టైటిల్ ఇచ్చారు. ఈ మేరకు రూపొందించిన స్పెషల్ వీడియోను ఈవెంట్ లో ప్రజెంట్ చేశారు. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్స్ మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్, కిషోర్ తిరుమల అతిధులుగా పాల్గొన్నారు.

ప్రీరిలీజ్ రిలీజ్ ఈవెంట్ లో ఛార్మింగ్ స్టార్ శర్వా మాట్లాడుతూ.. స్వామి శరణం. అందరికీ నమస్కారం. ముందుగా మనమే వస్తామని చెప్పి ముచ్చటగా నాలుగో సారి సీఎం అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హార్టీ కంగ్రాజులేషన్స్. చాలా సంతోషంగా వుంది. రిజల్ట్స్ వచ్చేశాయి. ఒక పండగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. జూన్ 7న మనమే అంటూ మరో పండగ స్టార్ట్ అవుతోంది. దాని తర్వాత 27 కల్కి. మరో పండగ వాతావరణం. ఇక నుంచి అన్ని మంచి రోజులే. శ్రీరామ్ మనమే కథ ఎప్పుడో చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే కథ చేయాలి. అయితే వరుసగా సీరియస్ సినిమాలు చేసేస్తున్నానని నాకే అనిపించింది. అందరూ కనబడినపుడు మహానుభావుడు, ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి ఎంటర్ టైనర్స్ చేయమని కోరేవారు. నాకూ ఎప్పుడూ కొత్తగా చేయాలనే వుంటుంది. కథల్లో క్యారెక్టరైజేషనే కొత్తగా వుంటుంది. మనమే లో అలాంటి కొత్త క్యారెక్టరైజేషనే వుంది. మంచి కథ చేయాలి, ఎంటర్ టైన్నింగ్ గా వుండాలని అనుకున్నాం. అన్నీ సినిమాలు కాదని ఈ సినిమాని ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటీఫుల్ పాయింట్ టైం గురించి. మనిషి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ టైం. ఈ సినిమాలో శ్రీరామ్ ఆదిత్య ఈ పాయింట్ ని చాలా చక్కగా చెప్పారో చూస్తారు. లాస్ట్ 40 మినిట్స్ మిమ్మల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెల్తారు. ఓన్లీ ఎంటర్ టైన్మెంట్ కి ఓ మంచి సినిమా తీయాలని చేశాం. ఎట్టిపరిస్థితిలో డిస్సాపాయింట్ చేయనివ్వం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

ప్రతిఒక్కరం చాలా కష్టపడి ప్రతి రోజు గొడవపడుతూ సినిమా చేశాం. సినిమాని నమ్మాము. ప్రేమించాం. ప్రేమ వున్నప్పుడు ఎప్పుడూ గొడవలు వుంటాయి. ఈ సినిమాని అంతగా ప్రేమించాను. నేను ఇంత కొత్తగా కనిపించినా, పెర్ఫెర్ఫాం చేసిన ఆ క్రెడిట్ అంతా శ్రీరామ్ కే ఇస్తా. తనని మొదటి నుంచి బలంగా నమ్మాను. తను చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి చెబుతూనే వున్నాను. శ్రీరామ్.. ఐ హేట్ యూ . ఐ లవ్ యూ టూ. వాళ్ళ వైఫ్ మీ రెండో పెళ్ళామని ఎప్పుడూ అంటూ వుంటారు.(నవ్వుతూ) వాళ్ళిద్దరూ ఎంత గొడవపడ్డారో తెలీదు కానీ మేము ఈ సినిమాకి అంత గొడవ పడ్డాం. దిని గురించి సక్సెస్ పార్టీలో మాట్లాడుకుందాం.సక్సెస్ అంటే గుర్తుకువచ్చింది. ఈ ఫంక్షన్ పిఠాపురంలో చేయాలని అనుకున్నాం. కానీ పర్మిషన్ దొరకలేదు. విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్ అక్కడ చేస్తాం. సినిమా సక్సెస్ పార్టీ పిఠాపురంలో జరగాలని నా కోరిక. సక్సెస్ కొట్టిన తర్వాత పిఠాపురంలో కలుస్తాం అన్నారు.

Also Read:ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్..

- Advertisement -