కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌..

59
Minister sabitha
- Advertisement -

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు – మన బడి మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో చేపట్టిన 12 రకాల సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఈ పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ లతో సమన్వయం చేసుకొని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆమె ఆదేశించారు.

రాష్ట్రంలోని 26,055 స్కూళ్లను మూడేళ్లలో మూడు దశల్లో రూపురేఖలు మార్చేయాలని సంకల్పించిందని తెలిపారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను 3,497.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నమని పేర్కొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ ని, విద్యార్థుల తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను భాగస్వామ్యం చేసి విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -