‘గ్రేట్ శంకర్’గా మెగాస్టార్.. టీజర్ అదిరింది..

310
Mammootty Great Shankar
Mammootty Great Shankar
- Advertisement -

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ”గ్రేట్ శంకర్” పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం చిత్ర టీజర్‌ను యువ హీరో ఆది సాయికుమార్ విడుదల చేశారు. ఈ సినిమాలో మమ్ముట్టి కాలేజ్ లెక్చరర్‌గా కనిపిస్తున్నాడు. రౌడీయిజం.. రాజకీయాలను కాలేజ్ క్యాంపస్ లోకి అడుగుపెట్టనీయని లెక్చరర్‌గా ఆయన ఈ సినిమాలో నటించాడు.

ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ .. ఉన్నిముకుందన్ పోలీస్ ఆఫీసర్స్‌గా ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో పూనమ్ బజ్వా కనిపించనుంది. దీపక్ దేవ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తెలుగు ఆడియన్స్ కి మమ్ముట్టి బాగా తెలుసు. ఇక ఉన్ని ముకుందన్ కూడా పరిచయమే. వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఇటీవల ఇక్కడ క్రేజ్ పెరిగిపోయింది. అందువలన ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేస్తున్నారని అనుకోవచ్చు.

- Advertisement -