మోడీకి గుడి కట్టిస్తా:మమతా

15
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సెటైర్ వేశారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్సీ. ప‌ర‌మాత్ముడే త‌న‌ను ఓ కార‌ణం కోసం ఈ భూమ్మీద‌కు పంపిన‌ట్లు ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. కోల్‌క‌తాలో ఓ ర్యాలీలో మాట్లాడిన మమతా.. ఒక‌వేళ మోడీ త‌న‌కు తాను దేవుడిగా భావిస్తే, ఆయ‌న కోసం ఓ ఆల‌యాన్ని నిర్మించాల‌ని, అక్క‌డే ఆయ‌న ఆసీనుల‌వుతార‌ని చురకలు అంటించారు.

అప్పుడైన ఈ దేశాన్ని ఇబ్బందిపెట్ట‌డం ఆగిపోతుంద‌ని…దేవుళ్ల‌కే దేవుడిని అని ఒక‌రు అంటున్నార‌ని, జ‌గ‌న్నాథుడే త‌న భ‌క్తుడు అని ఒక‌రు అంటున్నార‌ని, ఒక‌వేళ ఆయ‌న దేవుడే అయితే, అప్పుడు ఆయ‌న రాజ‌కీయాలు చేయ‌వ‌ద్దని సూచించింది మమతా.

అవసరమైతే మోడీ కోసం ఆల‌యాన్ని నిర్మిస్తామ‌ని, అక్క‌డ ఆయన్ను పూజిస్తామ‌ని, ప్ర‌సాదం,పువ్వులు స‌మ‌ర్పిస్తామ‌ని, ఆయ‌న‌కు దోక్లా కూడా నైవేద్యం పెడుతామ‌ని సెటైర్ వేశారు.తాను ఎంతో మంది ప్ర‌ధానుల‌తో ప‌నిచేశాన‌ని కానీ ఇలాంటి ప్ర‌ధానిని ఎప్పుడూ చూడ‌లేద‌నిన్నారు.

Also Read:ఓటీటీ ట్రెండింగ్‌లో SIT!

- Advertisement -