ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి ఫైరయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన పదిరాష్ట్రాల సీఎంలు,అధికారులతో నిర్వహించి సమావేశంలో కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకే మాట్లాడే అవకాశం కల్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొవిడ్-19పై జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రులను కనీసం మాట్లాడేందుకూ అనుమతించడం లేదని…ప్రధాని నరేంద్ర మోదీతో భేటీల్లో ముఖ్యమంత్రులను అన్నింటికీ తలలూపే తోలుబొమ్మల స్థాయికి దిగజార్చారని మమతా బెనర్జీ ఆరోపించారు.
సీఎంలతో ప్రధాని సమావేశం దారుణంగా విఫలమైందని …ఇది సీఎంలను అవమానించేలా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రధానితో భేటీల్లో మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై అన్ని రాష్ట్రాల సీఎంలు నిరసన తెలపాలని దీదీ పిలుపు ఇచ్చారు. తాను కరోనా టీకాల కొరత గురించి నిలదీద్దామని అనుకున్నా నోరెత్తనివ్వలేదని మమత ఆరోపించారు.