వరంగల్‌కు సీఎం కేసీఆర్‌…

34
kcr

సీఎం కేసీఆర్ ఇవాళ వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనున్న సీఎం…అక్కడి కరోనా రోగులను పరామర్శించి మాట్లాడనున్నారు. అలాగే వైద్యం అందుతున్న తీరును తెలుసుకోని బాధితుల్లో ధైర్యం నింపనున్నారు.

బేగంపేట విమానాశ్ర‌యం నుంచి హెలికాప్ట‌ర్‌లో సీఎం కేసీఆర్‌ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సుబేదారికి సీఎం హెలికాప్ట‌ర్‌లో చేరుకుంటారు. అక్క‌డినుంచి రాజ్య‌స‌భ ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మికాంత‌రావు ఇంటికి వెళ్ల‌నున్నారు. తొలుత వరంగల్ సెంట్రల్ జైలు తర్వాత ఎంజీఎంను సందర్శించనున్నారు. అనంత‌రం తిరిగి హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నారు.