దీదీ పానీ పూరీ…ఫుల్ గిరాకీ!

32
didi
- Advertisement -

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే. తాజాగా డార్జిలింగ్‌లో పానీ పూరీ అమ్ముతూ వార్తల్లో నిలిచారు. మూడు రోజుల పాటు డార్జిలింగ్ లో పర్యటిస్తున్న సందర్భంగా దీదీ పానీ పూరీ అమ్మారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనటానికి హిల్ స్టేషన్ కు వచ్చారు.

ఇందులో భాగంగా మాల్ రోడ్ లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ అమ్మారు. దాంతో సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు. మమతా పానీ పూరీ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు.

- Advertisement -