హాలీవుడ్ నుంచి మహేశ్ బాబుకు ఆహ్వానం

257
Bill-Duke-Mahesh-Babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి మూవీలో బిజీగా ఉన్నాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటింస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈమూవీలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మే9న ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈసందర్భంగా మే1వ తేదిన హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించనున్నారు.

మహేశ్ బాబుకు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా అభిమానులున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ బాబును హాలీవుడ్ నటుడు లంచ్ కు రమ్మని ఆహ్వానించాడు. హాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ గా పేర్కొనే ప్రిడేటర్, ఎక్స్ మెన్ చిత్రాల్లో నటించిన బిల్ డ్యూక్ మహేశ్ కు ఆహ్వానం పంపించాడు. మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి, ఏఆర్ మురగదాస్ లను ఉద్దేశించి ట్వీట్ చేసిన బిల్ డ్యూక్, లాస్ ఏంజెల్స్ వస్తే తనను కలవాలని సూచించారు.

కుదిరితే ఇంటర్నేషనల్ స్పై మూవీ తిద్దామని చెప్పాడు. “లాస్ ఏంజెల్స్ వస్తే డౌన్ టౌన్ లో కలుద్దాం, డిన్నర్ చేస్తూ స్పై మూవీ గురించి చర్చిద్దాం” అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన మహేశ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ట్వీట్ కు మహేశ్ బాబు ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

- Advertisement -