బీఆర్ఎస్‌ను వీడను:మాలోతు కవిత

26
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీని వీడి ఒక్కొక్కనేత బయటకు వెళ్తున్న సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి పార్టీని వీడేందుకు సిద్ధం కాగా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత సైతం పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్పందించారు కవిత. తాను బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. మ‌హ‌బూబాబాద్ ఎంపీ బ‌రిలో ఉన్నాన‌ని …బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో మ‌హ‌బూబాబాద్ ఒక‌టి అన్నారు. పార్టీమార్పు అవాస్తవమేనని…కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు.

రాజ్యసభ ఎంపీ కేశవరావు, కడియం శ్రీహరి,ఆయన కూతురు కడియం కావ్య త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న సంగతి తెలిసిందే.

Also Read:Nara Rohith:ప్రతినిధి 2 టీజర్

- Advertisement -