మరో వీడియో విడుదల చేశారు మావోయిస్టు అగ్రనేత “మల్లోజుల”. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా అని వీడియోలో పేర్కొన్నారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతోంది… ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు అన్నారు.
ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయి… మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది అన్నారు మల్లోజుల.
మరోవైపు ఓ జర్నలిస్టుకు హిడ్మా రాసిన లేఖ వైరల్‌గా మారింది. తన ఆలోచనలు, నిర్ణయాలపై చత్తీస్గడ్ లోని బస్తర్ కి చెందిన ఓ జర్నలిస్టుకు హిడ్మా లేఖ రాశారు.ఏపీకి రావాలని నవంబర్ 10న లేఖ రాశారు. ఆయుధాలు వీడే అవకాశం ఉందని… భద్రత కల్పిస్తే తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు హిడ్మా ప్రకటించారు.త్వరలోనే హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ రిలీజ్ చేస్తామని లేఖలో పేర్కొన్నారు హిడ్మా.
Also Read:సత్యసాయి శత జయంతి వేడుకల్లో మోదీ

