మళ్ళీ నోటీసులా.. అవినాష్ రెడ్డి జైలుకే?

67
- Advertisement -

వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. 2019 ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్యలో ఇంతవరకు దొషులెవరో మిస్టరీగానే ఉంది. రాష్ట్రంలో తన అన్న కుమారుడు వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పటికి ఈ కేసు ఇంతవరకు తెలకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. టీడీపీ అధికారంలో ఉన్న టైమ్ లో హత్య జరగగా.. అప్పుడు వివేకా హత్య పై నానా హైరానా చేసిన వైఎస్ జగన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత వివేకా హత్య విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తూనే ఉంది.

వివేకా కుమార్తె సునీత రెడ్డి ఈ కేసు విషయంలో నిగ్గు తెల్చేందుకు ఒంటరిగానే కోర్టులను ఆశ్రయించడం.. న్యాయస్థానాలు సిబిఐ లకు ఈ కేసును అప్పగించడం ఇలా అన్నీ చకచక జరిగిపోయినప్పటికి దొషులు మాత్రం తేలడం లేదు. దొషులను తేల్చే క్రమంలో ఏపీ ప్రభుత్వమే అడ్డు నిలుస్తోందని సిబిఐ కోర్టు ముందు వాపోవడంతో ఈ కేసును ప్రస్తుతం తెలంగాణ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో దర్యాప్తు వేగవంతం చేసిన తెలంగాణ సీబీఐ.. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి ఆ మద్య నోటీసులు కూడా జారీ చేసింది.

ఇప్పుడు మరోసారి ఈ నెల 24న విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ రెండవసారి విచారణకు పిలవడంతో వైస్ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ విచారణ తరువాత అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన ఆశ్చర్యం లేదని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వంటివాళ్లు చెబుతున్నారు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ బాస్కర్ రెడ్డి కి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న సీబీఐ బాస్కర్ రెడ్డిని విచారించబోతున్నాట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి విచారణలో ఎలాంటి కీలక విషయాలు బయటపడతాయనేది పోలిటికల్ హిట్ ను పెంచుతోంది. మరి రెండవసారి సీబీఐ విచారణలో వివేకా హత్య కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

జగన్ గురి.. ఆ మంత్రులపైనే ?

లోకేశ్ యువగళం.. జోష్ నిల్ ?

కాంగ్రెస్‌తో పొత్తా.. ఛాన్సే లేదు!

- Advertisement -