రివ్యూ : మల్లేశం

1000
mallesham movie review
- Advertisement -

చేనేత కార్మికుల కష్టాలను తగ్గించడం కోసం ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం ఆధారం తెరకెక్కిన ‘మల్లేశం’. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం జీవిత‌క‌థ‌ ఆధారంగా తెరకెక్కగా రాజ్ ఆర్ దర్శకత్వం వహించారు. పెళ్లిచూపులు ఫేం ప్రియదర్శి లీడ్‌ రోల్‌లో కనిపించిన ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కింది. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది..?మల్లేశం సినిమా ఎలా ఉంది…?తొలిసారి లీడ్ పాత్రలో నటించిన ప్రియదర్శి ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..

Image result for mallesham movie review

క‌థ‌:

న‌ల్గొండ జిల్లాలోని ఓ గ్రామంలో చేనేత కార్మికుడు ఆత్మ‌హ‌త్య‌తో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. అప్పుల బాధతో చిన్నతనంలో చదువుమానేస్తాడు మల్లేశం. చేనేత వృత్తి చేస్తూ కాలం వెల్లదీస్తుంటారు. కొడుకు చేనేత ప‌ని చేస్తుంటే వారికి ఆసును అమ‌ర్చ‌డానికి మ‌ల్లేశం త‌ల్లి ల‌క్ష్మి ఎక్కువ క‌ష్ట‌ప‌డుతుంది. దీంతో ఆమె చేతి ఎముక‌లు విరిగిపోతాయి. త‌ల్లి బాధ చూడ‌లేక మ‌ల్లేశం, ఆసు యంత్రాన్ని క‌నుక్కోవాల‌నుకుంటాడు. అయితే అంతా ఎగతాళి చేస్తారు. సీన్ కట్ చేస్తే మల్లేశంకు పెళ్లి అవడం,భర్త ఆలోచనకు భార్మ పద్మ ఏ విధంగా సాయం చేసింది..?మల్లేశం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు..?పట్నం వచ్చిన మల్లేశంకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..?చివరికి ప్రపంచం నివ్వేరపోయేలా ఆసు యంత్రాన్ని ఎలా కనుగోన్నాడు అన్నదే మల్లేశం కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌ కథ,ప్రియదర్శి నటన,తెలంగాణ పల్లె పాటలు. సినిమాకు హీరో కథే. ఇక లీడ్‌ రోల్‌లో నటించిన ప్రియదర్శి తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెప్పడం,ఎమోషనల్‌ సీన్స్‌,ఆసు యంత్రాన్ని కనుగోనడానికి పడిన కష్టాలు లాంటి సీన్స్‌లో ప్రియదర్శి నటన సూపర్బ్‌. ఇక మల్లేశం భార్య పద్మ పాత్రలో అనన్య ఒదిగిపోయింది. మిగితా నటీనటుల్లో ఝాన్సీ, చ‌క్ర‌పాణి తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశౄరు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. చేనేత కార్మికుల కోసం ఆసు యంత్రాన్ని క‌నుగొని భారత ప్ర‌భుత్వం నుండి ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్న చింత కింది మ‌ల్లేశం లాంటి వ్య‌క్తి బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌డం అంటే సాహ‌సం చేస్తున్న‌ట్లే. అలాంటి సాహ‌సం చేసిన దర్శకుడు రాజ్ ఆర్‌ని అభినందించాల్సిందే. పాటలు బాగున్నాయి. తెలంగాణ ప‌ల్లె పాట‌ల‌ను కళ్లకు కట్టినట్లు చూపించారు రాజ్‌. రాబిన్ అందించిన నేప‌థ్య సంగీతం, కౌండిల్య కెమెరా ప‌నితం బాగుంది. ఎడిగింట్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for mallesham movie review

తీర్పు:

సినిమా క‌థలంటే క‌మ‌ర్షియ‌ల్ హంగులు, ఆర్భాటాలుండాలి అనుకునేవారికి మల్లేశం సినిమా ఓ ఇన్‌స్పిరేషన్‌. రియల్ హీరో కథను తెరమీద అంతే అద్భుతంగా చూపించారు రాజ్‌. మంచి ఎమోష‌న్స్‌తో చెప్పాల‌నుకున్న క‌థ‌ను చెబితే చాలు. ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతార‌నుకునే దానికి `మ‌ల్లేశం` చిత్ర‌మొక ఉదాహ‌ర‌ణ‌.ఓవరాల్‌గా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మ‌న‌సుని హ‌త్తుకునే స్పూర్తి ప్రధాత చిత్రం మల్లేశం.

విడుదల తేదీ:21/06/2019
రేటింగ్:3.75/5
న‌టీన‌టులు: ప్రియ‌ద‌ర్శి, అన‌న్య‌, ఝాన్సీ
సంగీతం: మార్క్ కె.రాబిన్‌
నిర్మాత‌లు: రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి
ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌.ఆర్‌

- Advertisement -