దేశమును ఋజు మార్గంలో పెడతా: సీఎం కేసీఆర్

77
kcr
- Advertisement -

దేశం దారితప్పి పోతోంది..అసహ్యం పుట్టించే పనులు జరుగుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం… శాంతి భద్రతలు ఉంటే నే అభివృద్ధి సాధ్యం అన్నారు. మత కల్లోల క్యాన్సర్ ను దేశం నుంచి అరికట్టాలని….నా చివరి రక్త పు బొట్టు వరకు దేశం కోసం పోరాడుతా అన్నారు. వనదుర్గ, మల్లన్న సాగర్ తో సహా 5 ప్రాంతాలను 1500 కోట్లతో అద్భుత టూరిజం డెస్టినేషన్ ను తయారు చేయాలన్నారు. రెండు 4 లేన్ల రహదారిని మల్లన్న సాగర్ కు నిర్మించాలన్నారు.

రూ. 100 కోట్లతో ఇంజనీరింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని తెలిపిన సీఎం… సినిమా షూటింగ్ గు వేదికగా మల్లన్న సాగర్ ను తీర్చి దిద్దాలన్నారు. మల్లన్న సాగర్ లో కలర్ పౌoటైన్ లు సంవత్సరన్నరలోపు తేవాలని.. సిద్దిపేట జిల్లా దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు.

భారత దేశం అబ్బుర పోయేలా తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అదిలాబాద్ లో మిషన్ భగీరథ ద్వారా అంటు వ్యాధులు వల్ల కలిగే చావులు అగాయన్నారు. బెంగుళూరు తర్వాత ఐటీ లో మేటి హైదరబాదేనని… హైదరాబాద్ నుంచి 1.5 లక్షల కోట్ల ఐటి ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. దేశంలో నిరుద్యోగిత తక్కువ గా ఉన్న రాష్ట్రం తెలంగాణేనని…జీఎస్‌డీపీలో,తలసరి ఆదాయంలో తెలంగాణ మేటి అన్నారు.

- Advertisement -