నేడే మల్లన్న సాగర్ ప్రారంభం..

155
mallanna sagar project
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టమైన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అతిపెద్ద‌దైన మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌ను రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ అంకితం చేయ‌నున్నారు

50 టీఎంసీల సామర్థ్యంతో సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల సరిహద్దులో మల్లన్న సాగర్‌లో దీనిని నిర్మించారు. మల్లన్నసాగర్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌కు, అక్కడి నుంచి గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు, మరో కాల్వ ద్వారా సంగారెడ్డిలోని మంజీర రిజర్వాయర్‌కు, హల్దీవాగు నుంచి మంజీర నదిలోకి.. అక్కడి నుంచి నిజాంసాగర్‌కు వెళ్లేలా ప్లాన్ చేశారు.

ఇక ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, జనగామ, మేడ్చల్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని దాదాపు 12 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. మల్లన్నసాగర్‌ను సముద్రమట్టానికి 557 మీటర్ల ఎత్తులో నిర్మించారు. కాళేశ్వరం వద్ద 100 మీటర్ల ఎత్తు నుంచి 557 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలను తరలించడానికి భారీ పంపుహౌస్‌లు, మోటార్లను ఏర్పాటు చేశారు. రిజర్వాయర్‌ చుట్టూ 22.60 కి.మీ.ల దూరం భారీ కట్టను నిర్మించారు. 8 గ్రామాలతోపాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురయ్యాయి.

- Advertisement -