సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన రాజశేఖర్ రెడ్డి..

255
kcr
- Advertisement -

విద్యా వంతుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి మొదట నుండి తెలంగాణ వాదిగా మంత్రి మల్లారెడ్డి తో కలిసి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ముఖ్య మంత్రి కేసిఆర్ ముందుకు వెళుతున్న తరుణంలో తన వంతు పాత్ర నిర్వ హించ డానికి రాజ శేఖర్ రెడ్డి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నాడు.

ఈ తరుణంలో కొన్ని సామాజిక సేవలు రక్త దాన శిబిరాలు, స్కూల్ విద్యార్థులకు పుస్త కాలు పంపిణీ లాంటి మరెన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వ హించి , అలాగే ఉన్నత విద్యా బోధనలో వినూత్న పద్ధతిలో అనునయించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేశారు. అలాగే మేడ్చల్ లోని ఆరు గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, గ్రామాల్లో కనీస అవసరాలకై స్థానిక నాయకులతో కలసి పనిచేయడం వారికి విద్య వైద్య సహాయం అందించడం లాంటి కార్యక్రమాలను నిర్వహించారు.

రాజశేఖర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేశారు. ఈ సందర్భంగా గా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా తనకు సీటు కేటాయించినందుకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నిబద్ధతతో చేస్తానని తెలియజేశారు.

అలాగే ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అతిపెద్ద మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరుపున రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అల్లుడైన రాజశేఖర్‌రెడ్డిని బరిలో దింపింది.

Marri Rajashekar Reddy

- Advertisement -