ప్రభాస్ అభిమానులతో నిర్మాతలు ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. “సలార్” నిర్మాతలు షూటింగ్ శరవేగంగా జరుగుతుందని ఓ ఫోటోతో అప్ డేట్ ఇచ్చారు.
“సలార్” మోస్ట్ ఎవయిటింగ్ పాన్ ఇండియా మూవీస్ లో ఒకటి. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. “KGF” ఫ్రాంచైజీ ,”కాంతారా” ఫిలిమ్ మేకర్స్ అయిన హోంబలే ఫిల్మ్స్ రూ. 400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బాహుబలి ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్ , కేజీఫ్ ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ కోసం వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ అంతా వెయిట్ చేస్తునారు. అయితే ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడిందనే టాక్ ఈ మధ్య సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. దీంతో ఈ ఏడాది ఈ క్రేజీ మూవీ థియేటర్స్ కి రాదనే ప్రచారం జరిగింది.
అందుకే మేకర్స్ ఘాట్ ఫోటోతో క్లారిటీ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. సోషల్ మీడియాలో, మేకర్స్ నైట్ షూట్ జరుగుతుందని చెప్తూ ఓ ఫోటో పోస్ట్ చేసి “షూట్ ప్రోగ్రెస్‌లో ఉంది” అంటూ తెలిపారు. ‘సలార్’ ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..