సాంకేతికత రోజురోజుకు విస్తరిస్తుండటంతో ప్రపంచం ఓ కుగ్రామంలా మారింది. అరచేతిలో ఒక స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం చేతిలో ఉన్నట్లే. ఫోన్ బిల్లు, పవర్ బిల్లుల చెల్లింపు సౌకర్యం నుంచి వినోదం, విద్య అన్నీ సౌకర్యాలను సెల్‌ఫోన్ ఇస్తోంది. ఇక ఇప్పటివరకు కొన్నిరకాల యాప్‌ల ద్వారానే కార్యక్రమాలు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.
ఇకపై సెల్‌ఫోన్‌లోనే టీవీని వీక్షించవచ్చు. త్వరలో డైరెక్ట్ టు మొబైల్ ప్రసారాలు ప్రారంభంకానున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా దేశ రాజధాని ఢిల్లీలో అమలు చేసేందుకు కేంద్ర సమాచారా ప్రసార మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర వివరాలను వెల్లడించారు. ఎఫ్ఎం రేడియోలాగానే ఈ మొబైల్ టీవీ ప్రసారం కానుంది. రేడియో ఫ్రిక్వెన్సీని అంఉదకునేందుకు ఒక రిసీవర్ ఉండగా బ్రాడ్‌బ్యాండ్, బ్రాడ్‌కాస్ట్ సాంకేతికతలను కలిపి మొబైల్ ఫోన్లలో డిజిటల్ టీవీ కార్యక్రమాలు అందుకునేలా చేస్తారు.
తద్వారా స్మార్ట్‌ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్ నేరుగా వస్తుంది. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల టీవీలే ఉండగా 60 కోట్ల స్మార్ట్‌ఫోన్లు, 80 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. దీంతో అందరికి టీవీని అందించడంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇవి కూడా చదవండి..