గ్రామాల అభివృద్దే సీఎం లక్ష్యంః మంత్రి పువ్వాడ

303
2-ministers
- Advertisement -

గ్రామాల అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళికలో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాధోడ్ లు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు పల్లెల ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వారు అధికారులను అడిగారు.

సీఎం తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా అధికారులు భాద్యత తీసుకోవాలని మంత్రులు అన్నారు. గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలాగే భావించి పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.సమీక్ష సమావేశానికి ముందు మంత్రుల బృందం ఖమ్మంలోని గాంధీ చౌక్ సర్కిల్‌లో గాంధీజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ బాలసాని అక్ష్మీ నారాయణ, మేయర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -