మేజర్ 3 రోజుల వసూళ్లు.. ఎంతంటే?

53
major
- Advertisement -

అడవి వేష్ ప్రధానపాత్రలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన వీరజవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం‘మేజర్’. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

అడివి శేష్ సరసన బాలీవుడ్ భామ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా, శోభిత ధూళిపాల ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించింది.ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.19.35 కోట్ల షేర్ వసూళ్లు సాధించగా గ్రాస్ పరంగా రూ.35.80 కోట్లు కలెక్ట్ చేసింది.

ఏరియాల వారిగా చూస్తే నైజాం – 5.01 కోట్లు,సీడెడ్ – 1.28 కోట్లు,ఉత్తరాంధ్ర – 1.42 కోట్లు,ఈస్ట్ – 0.95 కోట్లు,వెస్ట్ – 0.63 కోట్లు,గుంటూరు – 0.75 కోట్లు,కృష్ణా – 0.71 కోట్లు,నెల్లూరు – 0.50 కోట్లు,టోటల్ ఏపీ+తెలంగాణ – 11.25 కోట్లు (రూ.18.80 కోట్లు గ్రాస్),కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 1.25 కోట్లు,
హిందీ + ఇతర భాషలు – 2.15 కోట్లు,ఓవర్సీస్ – 4.70 కోట్లు రాబట్టింది.

- Advertisement -