- Advertisement -
మత ఘర్షణలతో గుజరాత్ అట్టుడికిపోయింది. కచ్ జిల్లాలోని భుజ్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో మసీదుపై దాడి చేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు దాని సమీపంలో ఉన్న షాపులపై దాడిచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రెండు వర్గాలపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన నేపథ్యంలో అల్లరు చోటుచేసుకోవడం గమనార్హం.
- Advertisement -