హైదరాబాద్‌కు అంతర్జాతీయ హంగులు..

585
bonthu rammohan
- Advertisement -

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ హంగులతో విశ్వ నగరంగా రూపొందించేందుకు సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు హోమంత్రి మహమూద్ అలీ. కార్వాన్‌ సర్కిల్‌లోని గుడిమల్కాపూర్ లో ఏర్పాటుచేసిన ఈ లైబ్రరీ నిమహమూద్ అలీ, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అలీ సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ గాను అమలు చేస్తున్న ఎస్ ఆర్ డి పి పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు ఇప్పటికే నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం లభించిన అప్పటినుంచి నగరాభివృద్ధి ని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో నే హైదరాబాద్ నగరం ప్రపంచ శ్రేణి నగరం లలో ఒకటిగా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

దార్శనికుడు అయిన కెసిఆర్ హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, ఎస్ ఆర్ డి పి పనులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కి వేలాది కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలు నిరుపేదలకు అండగా ఉన్నాయని తెలిపారు.

నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నగర అభివృద్ధి తో పాటు నగరవాసులకు విజ్ఞానాన్ని సమాచారాన్ని అందించాలని లక్ష్యంతో ఈ లైబ్రరీలకు జిహెచ్ఎంసి ద్వారా ఏర్పాటు చేస్తూన్నామని తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం వార్తా పత్రికలు, విజ్ఞాన దాయక పుస్తకాలు ఈ లైబ్రరీ ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేస్తున్నామని అన్నారు.

- Advertisement -