పోలీస్ ఉన్నతాధికారి వాహనంపై కూర్చొని హోంమంత్రి మహమూద్ అలీ మనవడు టిక్ టాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం,విమర్శలు రావడంతో మహమూద్ అలీ స్పందించారు.
టిక్ టాక్ వీడియో చేసిన తన మనవడిని తీవ్రంగా మందలించారు. ఫర్కాన్ అహ్మద్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి ఉంటే అతనిపై చర్యలు తీసుకోవచ్చని పోలీస్ అధికారులకు సూచించారు.
పోలీస్ జీపుపై ఉన్న తన స్నేహితుడిని గౌరవించకపోతే అతని పీక కోస్తా అనే డైలాగ్స్ తో ఫర్కాన్ అహ్మద్ టిక్ టాక్ వీడియో చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. దీంతో చట్టం ముందు అందరం సమానులే అని తెలిపిన హోంమంత్రి…తన మనవడిని మందలిస్తూనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
This #TikTok video shows grandson of #Telangana Home Minister #MahmoodAli seated on police vehicle (regd @TelanganaDGP?); his friend mimes to audio of a police officer being threatened that his throat will be slit if he is not respectful to the man on jeep; Creative licence?@ndtv pic.twitter.com/ym6RHrVSJ3
— Uma Sudhir (@umasudhir) July 18, 2019