బాలకృష్ణ పాటపై మహిళా కమిషన్ సీరియస్

2
- Advertisement -

తెలుగు సినిమా ఇండ్రస్ట్రీకి వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ మహిళా కమిషన్. తెలుగు సినిమా పాటల్లో మహిళలతో అసభ్యకరంగా డాన్స్ చేస్తూ చూపించారని వచ్చిన ఫిర్యాదులను పరిశీలించింది చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్.

అటువంటి కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని నిర్మాతలు మరియు కొరియోగ్రాఫర్‌లను హెచ్చరించారు మహిళా కమిషన్. ఇలానే కొనసాగిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చైర్‌పర్సన్ నేరెళ్ల శారద.

ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయం పై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

 

Also Read:హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్

- Advertisement -