పెళ్లి కాలేదు.. కానీ కూతురు ఉందిః బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

310
Mahi-Gill
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ మహీ గిల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పదేళ్ల క్రితం వచ్చిన ‘దేవ్ డీ’ అనే సూపర్ హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మహీ గిల్. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న ఆమె తన వ్యక్తిగత జీవతం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పెళ్లి కాలేదని కానీ మూడేళ్ల కూతురు ఉందని చెప్పింది.

తాను ఇంత వరకు పెళ్లి చేసుకోలేదని… అయితే రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపింది. ఒక కూతురికి తల్లి అయినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది అని చెప్పింది. తనకు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకుంటానని తెలిపింది. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

పెళ్లి కాకుండానే పిల్లలు ఉన్నారు..కుటుబం ఉంది ఇంకా పెళ్లితో అవసరం ఏం ఉంది అని చెప్పింది. పెళ్లి కాకుండానే పిల్లల్నికనడంలో ఎలాంటి సమస్య లేదని చెప్పింది. పెళ్లిపై తనకు చాలా గౌరవం ఉంది .. కానీ పెళ్లి చేసుకోవడమనేది పర్సనల్ ఛాయిస్ అని చెప్పుకొచ్చింది.

- Advertisement -