19న టీఆర్ఎస్ లో చేరనున్న సబితా ఇంద్రారెడ్డి

273
sabitha Karthik
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకురాలు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆపార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇటివలే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కూడా కలిశారు. ఇక తాజాగా వారు టీఆర్ఎస్ లో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 19న శంషాబాద్ లోని క్లాసిక్ కన్వేన్షన్ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈసభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. కేటీఆర్ సమక్షంలో వారు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సబితా, కార్తీక్ రెడ్డిలతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్దం అయినట్టు తెలుస్తుంది.

అలాగే మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సర్పంచ్ లు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 20మందితో ఈసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన రెండు మూడు రోజుల తర్వాత ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ముందు సీనియర్ నాయకురాలు పార్టీ మారుతుండటంతో కాంగ్రెస్ కు కోలుకొలేని షాక్ గా చెప్పుకోవచ్చు.. ఇటివలే ఆపార్టీకీ రాజీనామా చేసిన మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -