ఏప్రిల్ 27న…. భరత్ అను నేను

226
Maheshs Bharat Anu Nenu Release on april 27
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు…శ్రీమంతుడు ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భరత్ అను నేను. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుగుతుండగా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరగనుంది.

ఈ మూవీని వచ్చే సమ్మర్ కానుకగా.. ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. దీంతో మహేష్ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లైంది.  మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మా బేనర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉందని చిత్ర నిర్మాత దానయ్య తెలిపారు. మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ అని… మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుందని చెప్పారు.

 Maheshs Bharat Anu Nenu Release on april 27
ఇక ఈ సినిమాలో స్విటీ అనుష్క ఐటెం సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.  సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

- Advertisement -