సితారే … నా బెస్ట్ గిఫ్ట్

241
- Advertisement -

మహేశ్ ఈ పేరంటే  సినీ పరిశ్రమలో ఓ క్రేజ్. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగానే కాదు నటుడిగా శ్రీమంతుడిగా తన నటనవైవిధ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నటుడిగా ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నాడు ఈ ఘట్టమనేని ప్రిన్స్. అయితే వాటన్నిటికన్నా ఉత్తమ బహుమతి మాత్రం కుమార్తె సితారేనంటున్నారు మహేష్ .

Mahesh's Best Gift

జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహేష్ ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్‌ చేశారు. సితార నవ్వుతూ ఉన్న ఒక చక్కటి ఫొటోను అభిమానులతో పంచుకున్న మహేష్ ‌…. ‘సితార.. నేను ఇప్పటివరకు అందుకోని ఉత్తమ బహుమతన్నారు. తనే నా సంతోషం.. నా గర్వకారణం. అటువంటి కుమార్తెలను కలిగిన గొప్ప తల్లితండ్రులుగా మనం ఉందాం’ అని ట్వీట్‌ చేస్తూ ‘నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను మహేశ్‌ జత చేశారు.

Mahesh's Best Gift

సితార అంటే మహేష్‌కు ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ‘వన్ నేనొక్కడినే’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మహేశ్‌ ప్రస్తుతం ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎ.జె. సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -