అమితాబ్, జయబచ్చన్ విడిపోయారు..!

64
Amitabh

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన భార్య జయాబచ్చన్‌ విడి విడిగా ఉంటున్నారంటూ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అమర్‌సింగ్‌ బాంబు పేల్చారు. విభేదాల వల్ల అమితాబ్, జయ ఎప్పటి నుంచో వేర్వేరు ఇళ్లలో నివాసముంటున్నారని అమర్‌సింగ్‌ చెప్పినట్టు ఏబీపీ మజ్హా అనే వార్త సంస్థ ఓ కథనం ప్రచురించింది. అమితాబ్‌ కు ప్రాణ స్నేహితుడైన అమర్‌సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం..బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ‘నేను బచ్చన్‌ కుటంబంతో కలిసే నాటికే అమితాబ్‌, జయ విడివిడిగా ఉంటున్నారు. కేవలం బయటి ఫంక్షన్లకు మాత్రమే వారు కలిసి హాజరవుతుంటారు. ఒకరు ప్రతీక్ష్‌ (వారు నివాసం ఉండే ఇంటి పేరు)లో ఉంటే, మరొకరు ‘జానక్‌’లో నివసిస్తున్నారు. జయ, ఐశ్వర్యలకు కూడా అసలు పడదు. వాటకి కూడా నేను బాధ్యత వహించాలా. ప్రతీ విషయంలోనూ గొడవకు నేను కారణమంటూ మీడియా నా వైపే చూస్తోంద’ని అమర్‌సింగ్‌ అన్నారు.

Amitabh

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాద్‌ పార్టీలో సంక్షోభానికి కారణమయ్యాడంటూ అమర్ సింగ్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ చీలిపోవడానికి కారణం నేనేనంటూ ఆరోపణలు చేశారు..మరి అమితాబ్‌, జయ విడివిడిపోవడానికి కూడా కారణం నేనేనా అంటూ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ సమస్య ఏర్పడ్డా దానికి నేనే కారణమంటారు. అంబానీ సోదరులు విడిపోయినా.. వారి మధ్య సమస్య తెచ్చిపెట్టింది నేనే అన్నారు. కానీ దానికి కారణం నేను కాదు. బచ్చన్స్‌ విషయంలోనూ అదే అన్నారు. మరి అమర్‌సింగ్‌ వ్యాఖ్యలకు బచ్చన్‌ కుటుంబం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

Amitabh