మహేష్-జక్కన్న క్రేజీ కాంబినేషన్ ముహుర్తం ఖారారైంది. ప్రస్తుతం మహేష్ నటించిన స్పైడర్ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమా ప్రమోషన్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు.
బాహుబలి తర్వాత రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్టు స్క్రిప్టు వర్క్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తి చేసి మహేష్ బాబు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ విషయం అఫీషియల్ గా వెల్లడించే అవకాశం ఉంది. కాస్త టైమ్ తీసుకున్నా సరే బాక్సాఫీసు గట్టిగా కొట్టాలనేది రాజమౌళి ప్లాన్.
అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కడానికి సంవత్సరం పట్టే అవకాశం ఉంది. స్పైడర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నాడు మహేష్. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఓకే చేశాడు. ఈ రెండు సినిమాలు అయిపోవాలంటే వచ్చే ఏడాది వరకు సమయం పడుతుంది. కాబట్టి మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో సినిమా 2019లో రానుంది.
తెలుగులో మోస్ట్ పాపులర్ హీరోగా ఉన్న మహేష్ బాబుతో బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించి, అపజయం అంటే ఏమిటో తెలియని దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రాజమౌళి జతకడితే? బాక్సాఫీసు వద్ద ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే. అభిమానులు కోరుకుంటున్న ఈ కాంబినేషన్ త్వరలోనే నిజం కాబోతోంది.