రంగస్థలంలో కిక్కెక్కించే భామ..

349
- Advertisement -

డైరెక్టర్‌ సుకుమార్‌ సినిమాకేసే లెక్కలే వేరు. ఈయన సినిమాలన్నీ..పజిల్స్‌ని పోలి ఉంటాయి. సుక్కుభాయ్‌ వేసే పజిల్స్‌కి సినీ లవర్స్‌ దిమ్మతిరగాల్సిందే. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేసిన సుకుమార్‌ సినిమాలు ఈ మధ్య లెక్కలు తప్పుతున్నాయి. అయినా సరే…సుక్కుభాయ్‌నే ఎంకరేజ్‌ చేసేస్తున్నారు మన టాప్‌ హీరోస్‌. అందుకే వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు ఈ దర్శకుడు.

bollywood hot heroine To Do A Item Song In  Rangasthalam

ఇదిలా ఉండగా.. సుకుమార్‌ – రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్‌ మూవీ రంగస్థలం. ఉభయగోదావరి జిల్లాలో షూట్ జరుపుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో సందడి చేస్తోంది.

ఈ సినిమా కోసం హైదరాబాద్ బూత్ బంగ్లా ప్రాంతంలో దాదాపు 10 కోట్లు పెట్టి ఓ విలేజ్ సెట్ ని ఏర్పాటు చేశారు. కానీ చిరు మూవీ ‘సైరా’ విషయంలో బిజీగా ఉన్నాడు రామ్‌చరణ్‌. దాంతో ‘రంగస్థలం’ షూటింగ్‌ కి కాస్త బ్రేక్‌ పడింది.

  bollywood hot heroine To Do A Item Song In  Rangasthalam

అయితే చెర్రీ త్వరలోనే రంగస్థలం సెట్స్ లో హల్చల్‌ చేస్తాడని చిత్రటీమ్‌ చెబుతోంది. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ భామలు – కరీనా కపూర్ లేక ప్రియాంక చోప్రా ఐటమ్ భామలుగా హీటెక్కించే ఛాన్సెస్‌ ఉన్నాయంటూ టాక్‌.

అయితే చెర్రీతో చిందేసేందుకు, ఐటమ్ భామగా కిక్కిచ్చేందుకు కరీనా కపూర్ ఎక్కువ ఉత్సాహం చూపుతుందని సమాచారం. ఈ విషయం పై అధికారిక ప్రకటన కూడా వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. మరి కరీనా కపూర్ తో చెర్రీ చేసే హంగామా చూడాలంటే ఈ మూవీ రిలీజయ్యే వరకి కాస్త ఓపికపట్టాల్సిందే.

- Advertisement -