సమ్మోహనం ప్రీరిలీజ్‌…అతిథిగా మహేష్‌

252
mahesh babu
- Advertisement -

సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్‌ సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకుంది.

ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రిన్స్ మహేష్ బాబు రానున్నాడు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. సినిమా నటీనటులతో పాటు దర్శక నిర్మాతలు,సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

స‌మ్మోహ‌నంకు డ‌బ్బింగ్ చెప్పిన అదితి..

సినిమాలో హీరో పాత్రకు సినిమా హీరోయిన్లంటే కాస్తంత చిన్న చూపు ఉంటుంది. టీజర్లో కూడ అదే విషయాన్ని హైలెట్ చేశారు మోహన్ కృష్ణ . ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, సుధీర్ బాబు మాత్రం సినిమా సక్సెస్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

- Advertisement -