డెహ్రాడూన్‏లో అల్లరోడి బర్త్‏డే సెలబ్రేషన్స్…‏

205
Allari Naresh's birthday
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో తన కామెడీతో అందరిని నవ్విస్తూ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈవీవీ సత్యనారాయణ కుమారుడు నరేష్. కెరీర్ ప్రారంభం నుంచే కామెడీతో కితకితలు పెట్టి అల్లరి నరష్ గా పేరు సంపాధించుకున్నారు. కానీ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం సిల్లీ ఫెలోస్ అనే సినిమాతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో నరేష్ కూడా పాల్గొంటున్నాడు. నేడు అల్లరోడి పుట్టిన రోజును చిత్రయూనిట్ సెట్ లో ఘనంగా సెలబ్రేట్ చేసింది.

Allari Naresh's birthday

ఈ సెలబ్రేషన్స్ లో మహేష్, వంశీపైడిపల్లి, పూజా హెగ్డే పాల్గొని నరేష్ కి కేక్ తినిపించారు. ఇక అల్లరోడి పుట్టిన రోజు వేడుకలో తన కూతురు కూడా సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింట్లో వైరల్ గా మారాయి. రాజసం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ కుచేలుడి పాత్రలో కనిపించనున్నారట. ఇక మహేష్ ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

- Advertisement -