గురు పూజ్యోత్సవం.. రేర్‌ ఫోటో షేర్‌ చేసిన మహేష్‌..

29
Mahesh Babu

ఈరోజు గురు పూజ్యోత్సవం. మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న గురు పూజోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ప్రతి మనిషికి మంచి, చెడు, విద్యాబుద్దులు, విలువలు నేర్పి ఓ ఉత్తమమైన స్థానంలో నిలబెట్టడంలో గురువు పాత్ర వెలకట్టలేనిది. గురు పూజోత్స‌వం సందర్భంగా టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మ‌హేష్‌ బాబు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా మహేష్‌ సోషల్ మీడియాలో స్పందించారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో తాను కలిసున్న ఓ ఆసక్తికరమైన ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ ఫొటో మహేష్‌ బాబు చిన్నప్పటిదని చూడగానే తెలిసిపోతుంది. కళ్లద్దాలు ధరించి ఎంతో క్యూట్‌గా ఉన్నాడు.

దీనిపై మహేష్‌ స్పందిస్తూ… త‌న గురువు త‌న తండ్రే అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇతరుల పట్ల ప్రేమగా ఉండడం, దృఢమైన వ్యక్తిత్వం, క్రమశిక్షణ, కరుణ, వినయం కలిగి ఉండడం వంటి అంశాలను తన తండ్రి ద్వారానే నేర్చుకున్నానని వెల్లడించారు. అందుకు తన తండ్రికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన జీవితంలో అనేక అంశాలు నేర్చుకోవడంలోనూ, వ్యక్తిత్వ పరిణామ క్రమంలోనూ తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మహేష్‌ వివరించారు. ఇక ప్రస్తుతం మహేష్‌ సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.