టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు దుబాయ్ ట్రిప్ కోసం ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యాడు. ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్టులో కనిపించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే త్వరలోనే సర్కారు వారి పాట విడుదల ఉండగా..మహేశ్ ఇలా సడెన్‌గా దుబాయ్‌కి వెళ్లడం అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే మహేశ్ తో మరో టాప్ సెలబ్రిటీ కూడా దుబాయ్ ట్రిప్‌లో జాయిన్ కాబోతుండటం చర్చాంశనీయంగా మారింది. ఇంతకీ ఆయనెవరనే కదా మీ సందేహం..మహేశ్‌తో నెక్ట్స్ సినిమా చేయబోతున్న డైరెక్టర్. ఆయనెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. ట్రిపుర్ ఆర్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి.
మహేశ్ బాబు-రాజమౌళి దుబాయ్‌లో తమ నెక్ట్స్ సినిమాపై చర్చించేందుకు కలవబోతున్నారన్న వార్త ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా కథ, కథనాన్ని మహేశ్ బాబుకు వివరించనున్నాడట జక్కన్న. మహేశ్ బాబు కోసం తన దగ్గర పలు ఇంట్రెస్టింగ్ కథలున్నాయన్న జక్కన్న..వాటి నుంచి ఇంకా ఏ సబ్జెక్ట్ ను ఫైనల్ చేయలేదని ఇటీవలే ఓ స్టేట్ మెంట్‌లో చెప్పుకొచ్చాడు. మొత్తానికి తాజా అప్ డేట్ చూస్తుంటే త్వరలోనే కొత్త సినిమాకు సంబంధించిన ఏదో విషయం బయటకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనున్నారు.
సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేష్ బాబు, రాజమౌళితో సినిమా చేయాలని కెఎల్ నారాయణ దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చాలా వీఎఫ్‌ఎక్స్‌కు అవకాశం ఉందట.అయితే తాజా ప్రాజెక్టు సర్కారు వారి పాట డబ్బింగ్, ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సిన మహేశ్ బాబు ఇలా సడెన్‌గా దుబాయ్ వెళ్లడంపై కొంతమంది అభిమానులు మాత్రం అయోమయానికి లోనవుతున్నారు. సర్కారు వారి పాట మే 12న విడుదల కానుంది. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంది. కాగా షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని తెలిపింది చిత్రబృందం. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలారు..