మహేష్ ఆమె వైపు, త్రివిక్రమ్ ఈమె వైపు

35
- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా రెగ్యుల‌ర్‌గా వార్తల్లోనే ఉంటుంది. రెండు నెల‌ల ముందు మ‌హేష్ స‌మ్మ‌ర్ వెకేష‌న్ల కారణంగా ఈ షూటింగ్‌కు బ్రేక్ వ‌చ్చింది. ఇవాళ గుంటూరు కారం కొత్త షెడ్యూల్ మొద‌లైంది. శంక‌ర్‌ప‌ల్లి స‌మీపంలోని జ‌న్వాడ ద‌గ్గ‌ర వేసిన భారీ సెట్‌లో ఈ రోజు నుంచి కొత్త షెడ్యూల్ మొద‌లైన‌ట్లు చిత్ర వ‌ర్గా స‌మాచారం. మరోవైపు గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. అధికారికంగా ఇంకా వెల్ల‌డించ‌లేదు కానీ, ఈ వార్త ఆల్మోస్ట్ క‌న్ఫ‌ర్మ్.

అయితే ఇప్పుడు పూజా హెగ్డే స్థానంలో హిట్2 సినిమాతో ప్రేక్ష‌కుల్ని బాగా అల‌రించిన మీనాక్షి చౌద‌రి గుంటూరు కారంలో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. ఐతే, ఓ దశలో సంయుక్త మీనన్ పేరు కూడా బాగా వినిపించింది. మరి త్రివిక్రమ్ – మహేష్ ఎవర్ని ఫైనల్ చేస్తారో చూడాలి. త్రివిక్రమ్ చూపు సంయుక్త మీనన్ మీద ఉంటే.. మహేష్ సపోర్ట్ మీనాక్షి చౌద‌రికి ఉంది. సో.. మహేష్ మాటే నెగ్గే అవకాశం ఉంది. పాపం మీనాక్షి చౌద‌రి దెబ్బకు సంయుక్త మీనన్ పెద్ద ఛాన్స్ ను మిస్ చేసుకుంది.

Also Read: KeedaaCola:నాయుడిగా తరుణ్‌భాస్కర్‌

ఈ ‘గుంటూరు కారం’ సినిమా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రానుంది. రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తోంది.

Also Read: ఆ ఆస్తులు ఎలా వచ్చాయి అషురెడ్డి ?

- Advertisement -