మహేష్‌- త్రివిక్రమ్‌ మూవీకి ముహుర్తం ఫిక్స్..

167
Mahesh
- Advertisement -

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు డైరెక్టర్‌ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి దర్శక నిర్మాతలు తాజాగా ఒక ప్రకటన చేశారు. వీరి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మితం కానుంది. మహేష్‌కు ఇది 28వ సినిమా. త్వరలోనే ఈ సినిమా షూటింగు మొదలవుతుందనీ, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నామనే విషయాన్ని అధికారికంగా తెలియజేశారు.

గతంలో మహేష్‌ బాబు హీరోగా త్రివిక్రమ్ ‘అతడు’ సినిమాను తెరకెక్కించాడు. అప్పట్లో ఆ సినిమా అంతగా ఆడకపోయినా, ఇప్పటికీ బుల్లితెరపై తన సత్తా చాటుతూనే ఉంటుంది. ఇక ఆ తరువాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ కూడా ఆశించినస్థాయిలో ఆడలేదు. అయితే మళ్లీ 11 ఏళ్ల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి నెలకొంది. కథానాయిక ఎవరన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -