మహేష్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్..

206
mahesh movie FirstLook release date fix
- Advertisement -

మహేష్‌బాబు సినిమా కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా తర్వాత మహేష్ స్పీడ్‌ తగ్గిందని టాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కాస్త లేటయినా.. మురుగదాస్‌ తో ఓ సినిమాకి కమిటయ్యాడు మహేష్‌ . ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిసెంబర్ నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చాలా సార్లు వాయిదా పడింది. దీంతో అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు. అయితే ఈ ఉగాది సందర్భంగా తప్పుకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక మహేశ్ బాబు తాజా చిత్రం షూటింగ్ కొన్ని రోజులుగా చెన్నైలో జరుగుతూ వస్తోంది. తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 15వ తేదీ నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

mahesh movie FirstLook release date fix

ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారట. ఇక ఇప్పటివరకు చాలా పేర్లు ప్రచారంలో ఉన్నా, యూనిట్ సభ్యులు అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు. మహేష్ బాబు కొత్త సినిమాకు స్పైడర్‌ టైటిల్ ని ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతకు ముందే ఈ టైటిల్ వినిపించినా.. నిర్మాతలు స్పై-డర్ ను రిజిస్ట్రేషన్ చేయించడంతోనే హంగామా మొదలైపోయిందని తెలుస్తోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

అదే రోజున టైటిల్ ఏమిటనేది కూడా రివీల్ కానుండటం, అభిమానులలో మరింత ఆసక్తిని రేకెత్తించే విషయం. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, జూన్ 23వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

- Advertisement -