విజయనిర్మలకు మహేష్ తల్లి నివాళి…

984
vijayanirmala
- Advertisement -

దర్శకురాలు విజయ నిర్మల హఠాన్మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. సినీ,రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి…విజయ నిర్మలకు నివాళులు అర్పించారు. ఆమె పార్దివదేహంపై పూల మాల వేసి నివాళులు అర్పించారు.

మరోవైపు విజయ నిర్మల మృతి ఇండస్ట్రీకి తీరని లోటని బాలకృష్ణ తెలిపారు. ద‌ర్శ‌కురాలిగా గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించి ఎందరో మ‌హిళ‌ల‌కి స్పూర్తిగా నిలిచారు .ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తున్నాను అని బాల‌య్య అన్నారు.

విజయనిర్మల అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. చిలుకూరులోని ఫామ్ హౌజ్ లో విజయనిర్మల అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

- Advertisement -