సుప్రీం తీర్పు శుభపరిణామం:మహేశ్‌

8
- Advertisement -

సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం అన్నారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తాం అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌లు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు అన్నారు.

ఈ నెల 8న హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు మహేశ్‌ గౌడ్. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం డిస్మిస్ చేస్తూ వెలువరించిన తీర్పుపై హర్షణీయం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Also Read:MBBS విద్యార్థికి అండగా కేటీఆర్..

- Advertisement -